Gaurav Gogoi: నిజం చెప్పండి ఆపరేషన్ ఆగిందా? లేదా..?

“ఆపరేషన్ ఆగిందా..? లేదా..?” – లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ గోగోయ్ కేంద్రాన్ని నిలదీసిన తీరు

లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ గోగోయ్(Gaurav Gogoi) తలపెట్టిన ప్రశ్నలు ఇప్పుడు జాతీయ రాజకీయం లో వేడిని పెంచుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందా..? ఆగిపోయిందా..? అనే ప్రశ్నకు కేంద్రం నుంచి స్పష్టత రావడం లేదని ఆయన విమర్శించారు.(Gaurav Gogoi)

  • రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండు విధాలుగా మాట్లాడుతున్నారు అని ఆరోపించారు.
  • ఒకవైపు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని చెబుతుంటే, మరోవైపు పాక్ మళ్లీ దాడి చేస్తే స్పందిస్తామని అంటున్నారు – ఇది ఏం సందేశమని ప్రశ్నించారు.

ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని గుర్తు చేస్తూ,

  • దాడి జరిగిన చోట సైన్యం గమ్యస్థానానికి నడుచుకుంటూ రావడం,
  • అంబులెన్స్ చేరుకోవడానికి గంట సమయం పట్టడం,
  • స్థానిక ప్రజల్లోని భయం, అనిశ్చితి గురించి భావోద్వేగంగా వివరిస్తూ “సైనికుడి వేషంలో ఉన్న ఉగ్రవాది ఎదురు చూస్తున్నాడని ప్రజలు భావించారు” అని అన్నారు.

Also Read :