TGP :టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత

నాంపల్లిలోని టీజీపీఎస్సీ(TGP) ఆఫీసు ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ పబ్లిక్​సర్వీస్​కమిషన్​ముందు బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రూప్ –1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలన్నారు. గ్రూప్– 2, గ్రూప్– 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని సూచించారు. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలన్నారు.(TGP) జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. గేటు లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, బీజేవైఎం నేతల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.

ALSO READ :