తెలంగాణలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీరువల్లే కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి (Ponnam) పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై పలు అపోహలు ప్రజల్లో వ్యాపించకుండా ఉండేందుకు (Ponnam) కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కులగణనను చట్టబద్ధం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి నిశ్చయంతో ముందుకెళ్లిందని మంత్రి తెలిపారు. ఈ చట్టం తెలంగాణ గవర్నర్ ఆమోదానంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపించబడిందని తెలిపారు. దీంతో, కేంద్రం నుంచి ఆమోదం ఆలస్యం కావడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఆలస్యం చోటు చేసుకున్నదని వివరించారు.

కుల గణన, రిజర్వేషన్ల విషయంలో 100% స్థాయిలో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ చర్యలు సాగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారు. కొంతమంది కావాలని అపోహలు కలిగించేలా మాట్లాడుతున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మవద్దని మంత్రి సూచించారు.
Also read :
Harish Rao: ఆసుపత్రిలో చేరిన హరీష్ రావు…
CM Revanth Reddy: 34 వైద్య కళాశాలల్లో వసతులు

