The Family man: ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఈజ్‌ బ్యాక్‌

ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’(The Family man) వెబ్ సిరీస్ మళ్లీ వచ్చేసింది. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ముచ్చటగా మూడోసారి అలరించడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇందులో మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్ర పోషించగా.. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘ఫ్యామిలీమ్యాన్‌: సీజన్‌3’ త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్​కానుంది. ఈ క్రమంలో తాజాగా టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తూ.. గ్లింప్స్​ను రిలీజ్​చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియోలో ‘మీరేం చేస్తుంటారంటూ..’ ఓ వ్యక్తి మనోజ్‌ బాజ్‌పాయ్‌ని అడగ్గా.. ‘నేను లైఫ్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ కౌన్సిలర్‌ను’ అంటూ తివారీ అతడికి రిప్లై ఇచ్చాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఈజ్‌ బ్యాక్‌.. న్యూ సీజన్‌ కోసం వేచి ఉండండి అంటూ వీడియోను ముగించింది. ఇందులో పాతాళ్ లోక్ న‌టుడు జైదీప్ అహ్లవ‌త్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ నార్త్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుండగా.. యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా భారీస్థాయిలో ఉండనున్నట్లు టీమ్‌ పేర్కొంది.

Also Read :