జూరాల(Jurala) ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టు డ్యామేజ్ అయిందంటూ, నీళ్లు లీకవుతున్నాయని బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు.
కాంగ్రెస్ హయాంలో నిర్మించిన జూరాల ప్రాజెక్టు ఇప్పటికీ దృఢంగా కొనసాగుతోందని, గేట్‌ల నిర్వహణలో సమస్యలు సహజమని వివరించారు. ప్రస్తుత వరద కారణంగా నిర్వహణలో కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతుండొచ్చని పేర్కొన్నారు.(Jurala)
జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 గేట్లు ఉండగా, వాటిలో రెండు మాత్రమే తాత్కాలికంగా మొరాయించాయనన్నారు. ప్రతి ఏడాది 8 గేట్లకు మరమ్మతులు చేసే ప్రథా ఉందని, ఈ ఏడాది ఇప్పటికే 4 గేట్ల రిపేర్ పూర్తయ్యిందని చెప్పారు.
ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అసలు మే నెలలోనే వరద రావడం గతంలో అరుదైన ఘటన. నిర్వహణ బృందం అనుసరిస్తున్న చర్యలతో ప్రాజెక్టు సురక్షితంగా ఉందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్‌ఎస్ ఆరోపణలు నవ్వు పుట్టిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కంటే ముందే ప్రారంభమైన ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిన ఘనత బీఆర్‌ఎస్ నేతలదే అన్నారు.
ఎన్నికల ముందు నార్లపూర్ వద్ద 8 పంపుల్లో ఒక్కదానిని మాత్రమే ఆన్ చేసి, అరగంటలో ఆపేశారని, కేవలం షోపీస్‌లా చూపించారని విమర్శించారు. కరెంట్ బిల్లు కట్టకపోవడమే నీటి రాక ఆపడానికి కారణమన్న మాటలు మరీ సిగ్గుచేటన్నారు.
సరళసాగర్ ప్రాజెక్టు పేరుతో ఇసుకను అమ్ముకొని లాభం చూసిన ఘనత కూడా బీఆర్‌ఎస్ నేతలకే దక్కిందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై స్పందించకుండా తప్పుడు ఆరోపణలు చేయడం తగదు అని హెచ్చరించారు.
Also Read :

