NEET: ముందురోజే పేపర్ లీకైంది

NEET

నీట్‌– (NEET) యూజీ ప్రవేశపరీక్ష లో పేపర్ లీక్ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న వేళ..కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎగ్జామ్ ముందు రోజు రాత్రే నీట్‌ (NEET) క్వశ్చన్ పేపర్ తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. పేపర్ లీక్ పై బిహార్ ప్రభుత్వ సిట్ ను ఏర్పాటు చేయగా.. ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌తో పాటు ముగ్గురు నీట్‌ అభ్యర్థులు ఉన్నారు.

హైకోర్టుల్లో విచారణపై సుప్రీం స్టే..
నీట్‌ ఎగ్జామ్ పేపల్ లీక్ పై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. హైకోర్టుల్లో నీట్ పై జరుగుతున్న విచారణలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలన్న ఎన్టీఏ విజ్ఞప్తితో కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. దాంతోపాటు నీట్‌ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు కూడా జారీ చేసింది. పరీక్షను ర‌ద్దు చేయాలా అన్న అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. కాగా నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆపేది లేదని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. జూలై 8నమ‌ళ్లీ ఈ కేసును విచారిస్తామని తెలిపింది.

Also read: