BRS : 2 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

భారత రాష్ట్ర సమితి (BRS)రెండు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మెదక్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డిని, నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బరిలోకి దింపుతున్నట్టు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటి వరకు 11 స్థానాలకు బీఆర్ఎస్(BRS) అధినాయకత్వం అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ప్రకటించిన రెండు స్థానాలతో కలిపి బీఆర్ఎస్(BRS) ఇప్పటిప వరకు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్లగొండ, హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది..
1. ఆదిలాబాద్- ఆత్రం సక్కు
2. పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్
3. చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
4. మల్కాజ్‌గిరి- రాగిడి లక్ష్మారెడ్డి
5. వరంగల్- కడియం కావ్య
6. మహబూబాబాద్- మాలోతు కవిత
7. మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
8. ఖమ్మం- నామా నాగేశ్వర్
9. కరీంనగర్- బోయిన్‌పల్లి వినోద్
10. నాగర్‌ కర్నూల్- ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
11. మెదక్- వెంకట్రామి రెడ్డి
12. జహీరాబాద్- గాలి అనిల్‌కుమార్
13. నిజామాబాద్- బాజిరెడ్డి గోవర్దన్

ALSO READ :