యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు బుధవారం స్వామివారి అలంకార సేవలు మొదలయ్యాయి. ఉదయం స్వామివారు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో విహరించారు. అర్చకులు మత్స్యావతార అలంకార సేవను నయనానందకరంగా నిర్వహించారు. మత్స్యావతారంలో భక్తులను కనువిందు పర్చారు. కార్యక్రమంలో (Yadagirigutta) ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఏఈవో గజవెల్లి రఘు, సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Also read:

