Telangana: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే?!

Telangana

(Telangana) తెలంగాణ తల్లి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆకు పచ్చ రంగు చీర ధరించి.. కిరీటాలు, భుజకీర్తులు లేకుండా సాదా సీదాగా తల్లిని మరిపించేలా ఉంది. చెవులకు జుంకాలు.. మెడలో బంగారు తీగను కంఠాభరణంగా ఉంది. చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులను పట్టుకొని అభయ హస్తంతో కనిపిస్తోంది. మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.

ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించనున్నారు. ప్రజా ఉద్యమాల నుంచి (Telangana) తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనేందుకు చిహ్నంగా గద్దెను ఏర్పాటు చేశారు. గద్దె అడుగు భాగాన పిడికిళ్లు..పై బాగాన విగ్రహాన్ని పైకి ఎత్తుతున్న చేతులు ఉన్నాయి. పిడికిలి బిగించి ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకొని సబ్బండ వర్ణాల చేతుల మీదుగా తెలంగాణ తల్లిని పైకి ఎత్తుతున్నట్టుగా తీర్చిదిద్దారు. ప్రజల మనోభీష్టానికి దగ్గరగా ఈ విగ్రహం ఉందనే టాక్ వస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపులేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

Image గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను పోలి ఉందన్న విమర్శలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో.. దొరల అహంకారానికి గుర్తుగా ఉందని ఆరోపిస్తూ వచ్చారు. చివరకు ఆయన అన్నట్లుగానే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించి ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ తల్లి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

And now a Congress version of Telangana Talli | And now a Congress version  of Telangana Talliఆకు పచ్చ రంగు చీర ధరించి.. కిరీటాలు, భుజకీర్తులు లేకుండా సాదా సీదాగా తల్లిని మరిపించేలా ఉంది. చెవులకు జుంకాలు.. మెడలో బంగారు తీగను కంఠాభరణంగా ఉంది. చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులను పట్టుకొని అభయ హస్తంతో కనిపిస్తోంది. మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించనున్నారు.

Also read: