విలక్షణ నటుడు కమల్ హాసన్, త్రిష, శింబు, నాజర్, జోజు జార్జ్ తదితరులు నటించిన సినిమా థగ్ లైఫ్(Thug life). భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ దురదృష్టవశాత్తు ఉదయం షో నుండే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కమల్ హాసన్, మణిరత్నం, ఎఆర్ రెహమాన్ ల శక్తివంతమైన కాంబో ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రమోషన్ల సమయంలో, కమల్ హాసన్ థగ్ లైఫ్(Thug life) ఎనిమిది వారాల పాటు థియేటర్లలో ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన తర్వాత, డిజిటల్ విడుదలపైనే ఆశలు పెట్టుకున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమైతే ఒక నెలలోపు ప్లాట్‌ఫామ్‌లోకి రావచ్చు. ప్రస్తుతానికి, నెట్‌ఫ్లిక్స్ ముందస్తు విడుదలకు అంగీకరిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read :