ఇన్నేళ్ల కెరీర్ లో దీపికా తొలిసారి తెలుగు సినిమా(Tollywood )కు సైన్ చేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో దీపిక ఫిమేల్ లీడ్ గా చేస్తోంది. దీపిక ని తీసుకోవడంతో కల్కి రేంజ్ మరింత పెరిగింది. సినిమాలో దీపిక పాత్ర ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే అంతకుముందు తెలుగు ఆఫర్ వస్తే చాలా తేలికగా తీసుకున్న దీపికా ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood )సినిమాలు నేషనల్ వైడ్ గా చేస్తున్న హడావిడి చూసి కల్కికి సైన్ చేసిందట. అదీగాక ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడం తో హాలీవుడ్ రేంజ్ సినిమా అని ఊహించి ఓకే చెప్పేసిందంటున్నారు. దీపిక కెరీర్ లో మొదటి సినిమా కల్కి. ఈ సినిమా హిట్ పడితే మాత్రం దీపికకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. బాలీవుడ్ సినిమాలే చేసినా తెలుగు ఆడియన్స్ లో కూడా దీపిక ఫ్యాన్స్ ఉన్నారు. కల్కి తో ఆమెను తెలుగు తెర మీద చూసి సర్ ప్రైజ్ అవుతారు. బాలీవుడ్ లో కూడా కాంపిటీషన్ పెరిగిపోవడంతో తనకు వచ్చే టాలీవుడ్ ఆఫర్లకు నో చెప్పే చాన్స్ లేదంటున్నారు ఫ్యాన్స్. రాబోయే కాలంలో తెలుగులో దీపిక మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.
Also read :
Rajinikanth : తలైవా బయోపిక్! హీరో ఎవరంటే??
Salman Khan : సల్మాన్ ఖాన్ కేసు.. ఉరేసుకున్న నిందితుడు

