దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు ముగియడంతో అంతా హైదరాబాద్ బాట పట్టారు. దీంతో టోల్ ప్లాజాల (Toll plazas) వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అద్దంకి-నార్కెట్ పల్లి రహదారి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లిన వారు హైదరాబాదుకు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో 65వ నంబరు జాతీయ రహదారిపై రద్దీ మరింత పెరిగింది. నిన్న కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ గ్రామ శివారులోని (Toll plazas) టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ లేన్ వాహనాలతో కిక్కిరిసింది.
టోల్ ప్లాజా కు దాదాపు అర కిలోమీటర్ వరకు బారులు తీరిన వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. ఒక్కో వాహనం టోల్ ప్లాజా నుంచి బయటకు వెళ్లేందుకు దాదాపు 5 నిమిషాల సమయం పట్టింది సాధారణంగా రోజుకు 20వేల వాహనాలు వెళ్లేయి రహదారిపై మరో 10 వేల వాహనాలు అదనంగా వెళ్ళినట్లు అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లిన భక్తులు, సాధారణ ప్రయాణికులతో టోల్ ప్లాజా నుంచి రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ టోల్ ప్లాజా వద్ద రాత్రి వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు ముగియడంతో అంతా హైదరాబాద్ బాట పట్టారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అద్దంకి-నార్కెట్ పల్లి రహదారి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లిన వారు హైదరాబాదుకు తిరుగు ప్రయాణమయ్యారు.
దీంతో 65వ నంబరు జాతీయ రహదారిపై రద్దీ మరింత పెరిగింది. నిన్న కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ గ్రామ శివారులోని టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ లేన్ వాహనాలతో కిక్కిరిసింది. టోల్ ప్లాజా కు దాదాపు అర కిలోమీటర్ వరకు బారులు తీరిన వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. ఒక్కో వాహనం టోల్ ప్లాజా నుంచి బయటకు వెళ్లేందుకు దాదాపు 5 నిమిషాల సమయం పట్టింది సాధారణంగా రోజుకు 20వేల వాహనాలు వెళ్లేయి రహదారిపై మరో 10 వేల వాహనాలు అదనంగా వెళ్ళినట్లు అంచనా.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లిన భక్తులు, సాధారణ ప్రయాణికులతో టోల్ ప్లాజా నుంచి రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ టోల్ ప్లాజా వద్ద రాత్రి వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
Also read

