TRIPTI :14 కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్

రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్‌ సినిమాతో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి(TRIPTI) డిమ్రి. ఇందులో అందం, అభియయంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ తో అభిమానులను ఆమె ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా ఈ అమ్మడు ముంబైలోని బాంద్రాలో లగ్జరీ హౌజ్ ని కొనుగోలు చేసిందని సమాచారం. బాలీవుడ్ ప్రముఖులకు నిలయమైన ఈ ప్రాంతంలో రూ.14 కోట్ల పెట్టి త్రిప్తి(TRIPTI) ఆ ఇంటిని కొన్నట్లు తెలిసింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రేఖ నివాసముండే కార్టర్ రోడ్‌లో.. రణబీర్ కపూర్, అలియా భట్ఇంటి పక్కన ఈ బ్యూటీ ఇల్లు కొనుగోలు చేసిందట. 2,226 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు -అంతస్తులతో ఈ ఇంటి నిర్మాణం జరిగిందట. ఇక ఉత్తరాఖండ్‌ కు చెందిన త్రిప్తి.. లైలా మజ్ను మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుత భూల్ భూలయ్యా 3, బాడ్ న్యూజ్, ధడక్ 2 సినిమాలలో యాక్ట్ చేస్తోంది.

ALSO READ :