Telangana: తెలంగాణలో ట్రంప్ గుడి..

telangana

అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు (Telangana) తెలంగాణలోనూ అభిమానులున్నారు. ఆయన కోసం ఏకంగా గుడి కట్టేశాడు జనగామ జిల్లా కొన్నె గ్రామ వాసి. నిత్యపూజలు చేశాడు. ఉపవాస దీక్షలో ఉన్నాడు. కానీ 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని భరించలేదు మనోవేదనతో మృతి చెందాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ.. డొనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని. 2019లో.. మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించి.. ఓకే చెప్పారు. తన మెసేజ్‌కు రిప్లై ఇవ్వడంతో.. కృష్ణ ఆనందానికి అవధులు లేవు. కృష్ణ.. తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించాడు. ట్రంప్ పేరు ఉన్న టీ షర్టులను ధరించేవాడు. గ్రామస్తులంతా ఆయనను ట్రంప్ కృష్ణ అని పిలిచేవారు. (Telangana) ఊళ్లో రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసేవాడు. అతని తల్లిదండ్రులు తూప్రాన్‌కు వలసెళ్లారు. వారి వద్దకు వెళ్లిన కృష్ణ టీ తాగుతూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ భార్య కూడా అంతకుముందు మగబిడ్డను ప్రసవిస్తూ మరణించింది. ట్రంప్‌ రెండోసారి గెలవడంతో కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.

Image

అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తెలంగాణలోనూ అభిమానులున్నారు. ఆయన కోసం ఏకంగా గుడి కట్టేశాడు జనగామ జిల్లా కొన్నె గ్రామ వాసి. నిత్యపూజలు చేశాడు. ఉపవాస దీక్షలో ఉన్నాడు. కానీ 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని భరించలేదు మనోవేదనతో మృతి చెందాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ.. డొనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని. 2019లో.. మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించి.. ఓకే చెప్పారు. తన మెసేజ్‌కు రిప్లై ఇవ్వడంతో.. కృష్ణ ఆనందానికి అవధులు లేవు. కృష్ణ.. తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించాడు. ట్రంప్ పేరు ఉన్న టీ షర్టులను ధరించేవాడు. గ్రామస్తులంతా ఆయనను ట్రంప్ కృష్ణ అని పిలిచేవారు. ఊళ్లో రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసేవాడు. అతని తల్లిదండ్రులు తూప్రాన్‌కు వలసెళ్లారు. వారి వద్దకు వెళ్లిన కృష్ణ టీ తాగుతూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ భార్య కూడా అంతకుముందు మగబిడ్డను ప్రసవిస్తూ మరణించింది. ట్రంప్‌ రెండోసారి గెలవడంతో కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.

 

Also read: