హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు పెరుగుతుండడంతో స్కూళ్లకు ఈ నెల15 నుంచి ఒంటిపూట బడులుగనిర్వహిచాలని రాష్ట్ర ప్రభుత్వం (Government) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హాఫ్ డే స్కూల్స్ పై ప్రభుత్వం (Government) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 .30వరకు స్కూల్స్ నడపాలని సూచించింది. విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక టెన్త్ ఎగ్జామ్స్‌కు కేటాయించిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
Also read:

