మాజీ సీఎం కేసీఆర్ కు, ఆయన కుమారుడు కేటీఆర్ కు, మేనల్లుడు హరీశ్ రావుకు కూడా రైతు భరోసా ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(tummala) అన్నారు. ఇవాళ తుమ్మల(tummala) మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘పదేళ్ల ప్రభుత్వంలో రైతు బంధు ఎంత ఇచ్చామో అనే సోయి లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాళ్ళు – గుట్టలు లెక్కలు త్వరలోనే బయటకు వస్తాయి. శాటిలైట్ ఇమేజ్ తో వ్యవసాయ భూమి లెక్కలు తీసే పని మొదలు అయింది. ఇప్పటి వరకు 34 లక్షల 75వేల 994 మందికి రైతుల ఖాతాలో నిధుల జమ చేశాం. రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు 2223.46 కోట్లు నిధులు విడుదల చేసినం. ఇప్పటి వరకు 37 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులను రిలీజ్ చేసినం. పదేండ్లు ఏమీ చేయని కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతుండు. పదేళ్లు రైతుల గురించి మాట్లాడని కేటీఆర్ ఇప్పుడు మాట్లాడటం ఏంటి? రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. కేసీఆర్ కు ఉన్న ఉద్యమ గౌరవాన్ని కేటీఆర్ లేకుండా చేస్తున్నారు. వ్యవసాయ శాఖ సబ్జెక్ట్ ను వదిలేస్తే ఏమైనా లాభం ఉంటది లేదంటే ఎంపీ ఫలితాలు రిపీట్ అవుతాయి.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 
మాజీ సీఎం కేసీఆర్ కు, ఆయన కుమారుడు కేటీఆర్ కు, మేనల్లుడు హరీశ్ రావుకు కూడా రైతు భరోసా ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ తుమ్మల మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘పదేళ్ల ప్రభుత్వంలో రైతు బంధు ఎంత ఇచ్చామో అనే సోయి లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాళ్ళు – గుట్టలు లెక్కలు త్వరలోనే బయటకు వస్తాయి. శాటిలైట్ ఇమేజ్ తో వ్యవసాయ భూమి లెక్కలు తీసే పని మొదలు అయింది. ఇప్పటి వరకు 34 లక్షల 75వేల 994 మందికి రైతుల ఖాతాలో నిధుల జమ చేశాం. రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు 2223.46 కోట్లు నిధులు విడుదల చేసినం. ఇప్పటి వరకు 37 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులను రిలీజ్ చేసినం. పదేండ్లు ఏమీ చేయని కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతుండు. పదేళ్లు రైతుల గురించి మాట్లాడని కేటీఆర్ ఇప్పుడు మాట్లాడటం ఏంటి? రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. కేసీఆర్ కు ఉన్న ఉద్యమ గౌరవాన్ని కేటీఆర్ లేకుండా చేస్తున్నారు. వ్యవసాయ శాఖ సబ్జెక్ట్ ను వదిలేస్తే ఏమైనా లాభం ఉంటది లేదంటే ఎంపీ ఫలితాలు రిపీట్ అవుతాయి.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Also read
Delhi: చీపురు మూలకు.. కమలం ముందుకు
Ramgopal Verma: ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్

