Japan: ‘ట్విట్టర్ కిల్లర్‌’ ఉరితీత

జపాన్‌లో(Japan) సుమారు మూడేండ్ల తర్వాత మరణశిక్ష అమలు చేశారు. ‘ట్విట్టర్‌ కిల్లర్‌’గా పేరున్న టకాహిరో షిరాయిషిని ఉరి తీసినట్లు ఆ దేశ న్యాయశాఖ అధికారికంగా ప్రకటించింది. టకాహిరో.. ట్విట్టర్‌లో సూసైడ్​కు సంబంధించిన పోస్టులు పెట్టే యువతనే టార్గెట్‌గా చేసుకునేవాడు(Japan). బాధను తనతో పంచుకోమంటూ మాటల కలిపి.. స్నేహం చేసేవాడు. అనంతరం ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగించేవాడు. ఆ తర్వాత తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. ఆపై డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కుని.. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు. ఇలా ఏకంగా 9 మందిని కర్కశంగా హత్య చేశాడు. వారిలో 26 ఏండ్ల లోపు 8 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పోలీసులు 2017లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 2020లో ఈ సీరియల్ కిల్లర్‌కు టోక్యో కోర్టు ఉరిశిక్ష విధించింది. తాజాగా అతడికి మరణ శిక్ష విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: