ఇద్దరు మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఇవాళ రాచకొండ(Rachakonda) సీపీ ఎదుట లొంగిపోయారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీ మెంబర్ గా ఉన్న మాల సంజీవ్ అలియాస్ లెంగు దాదా, ఆయన భార్య, పార్టీ స్టేట్ కమిటీ సభ్యురాలు పార్వతి అలియాస్ దీనా లొంగిపోయినట్టు సీపీ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా యాప్రాల్ కు చెందిన సంజీవ్ వయస్సు 62 సంవత్సరాలు. 1980 లో గద్దర్ నేతృత్వంలోని జననాట్యమండలిలో చేరారు. 45 ఏండ్ల పాటు అజ్ఞాతంలో గడిపినట్లు సీపీ తెలిపారు.(Rachakonda) ఈ క్రమంలో గద్దర్ తో కలిసి 16 రాష్ట్రల్లో కార్యకలాపాలు చేసినట్టు చెప్పారు. గతంలో గద్దర్ కు ముఖ్య అనుచరుడిగా పనిచేసినట్టు తెలిపారు. ఆయన 1982లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన పంజాల సరోజా అలియాస్ విద్యను వివాహం చేసుకున్నారని అన్నారు. 2002లో ములుగు జిల్లా అయిలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆమె మృతి చెందిందని చెప్పారు. ఆ తర్వాత సంజీవ్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారన్నారు. 2003లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కి బదిలీ అయ్యి, సీఎన్ఎం ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. తర్వాత సంజీవ్, దీనా ను పెళ్లి చేసుకున్నారని తెలిపారు. పార్వతి అలియాస్ దీనా స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరమని చెప్పారు. వీళ్లిద్దరూ గతంలో ఎన్నో సార్లు కాల్పులు టైంలో వీరిద్దరూ పోలీసులు నుంచి తప్పించుకున్నారని వివరించారు. వీళ్లపై రూ. 20 లక్షల చొప్పున రివార్డులున్నాయని అన్నారు. ఆ మొత్తాన్ని వాళ్లకు ఇస్తామని తెలిపారు.
Also Read :

