Uppal Stadium : ఉప్పల్ స్టేడియం కాడా బ్లాక్ టికెట్ల లొల్లి

ఐపీఎల్ మ్యాచ్​టికెట్ల సేల్స్​లో బ్లాక్​దందా కొనసాగుతోందని ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పీవైఎల్ నేతలు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వద్ద ఆందోళనకు దిగారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌కు వినతిపత్రం ఇవ్వడానికి స్టేడియం(Uppal Stadium) వద్దకు వెళ్లారు. సిబ్బంది అనుమతి నిరాకరించడంతో గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది. 20 నిమిషాల్లో 70 వేల టికెట్లు ఏవిధంగా అమ్ముడుపోయాయంటూ ప్రశ్నించారు. క్రికెట్ ఫ్యాన్స్​కు టికెట్లు దొరక్క ఇబ్బందిపడుతున్నారన్నారు.

ఏప్రిల్ 25న జరిగే ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Also read  :

Gutha Sukender Reddy : బీఆర్ఎస్ నేతలకు అహంకారం

Revanth Reddy : బట్టలూడదీసి ఉరికిచ్చి కొట్టిస్త