అమెరికా (US) ప్రభుత్వం మళ్లీ ఒకసారి షట్‌డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఫెడరల్ ఫండింగ్ పొడిగింపుపై బిల్లుకు గడువు ముందు సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో అవసరమైన 60 ఓట్లు రాకపోవడంతో ఈ (US) పరిస్థితి తలెత్తింది.
ఏమైంది?
సెనెట్‌లో బిల్లు పై ఓటింగ్‌లో 60 ఓట్లు అవసరం కాగా, కేవలం 55 ఓట్లు మాత్రమే రావడంతో తీర్మానం విఫలమైంది.ఫలితంగా, భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది.
ఉద్యోగులపై ప్రభావం
సుమారు 7.50 లక్షల మంది ఉద్యోగులు తాత్కాలికంగా ఇంటికే పరిమితమయ్యారు.శాస్త్రీయ పరిశోధనలు, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాలు మూతపడుతున్నాయి.వేతనం లేకుండా దశలకొద్దీ వేలాది మంది ఉద్యోగులు ఇంటికే వెళ్లాల్సి వస్తోంది.
ఏ సేవలు కొనసాగుతాయి?
సరిహద్దు భద్రతసైనిక సిబ్బందిన్యాయపాలన విభాగం
ఇవన్నీ కొనసాగుతాయి కానీ సమస్య పరిష్కారం అయ్యే వరకు జీతాలు అందవు.
అమెరికాలో షట్‌డౌన్ చరిత్ర
1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ పరిస్థితిని ఎదుర్కొంది.వీటిలో ఎక్కువ శాతం ఒక్కటి లేదా రెండు రోజులకే పరిష్కారమయ్యాయి.అయితే, డోనాల్డ్ ట్రంప్ తొలి పదవీకాలంలో జరిగిన షట్‌డౌన్‌నే అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైనది.
రాజకీయ విభేదాలు
రిపబ్లికన్లు: ఆరోగ్య సబ్సిడీలపై సంస్కరణలపై చర్చించేందుకు సిద్ధమని చెబుతున్నారు.డెమోక్రాట్లు: బడ్జెట్‌ను “బందీ” చేస్తున్నారని రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు.రాజీ లేకుంటే ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
షట్‌డౌన్ అంటే ఏమిటి?
అమెరికా ఫెడరల్ బడ్జెట్‌ను కాంగ్రెస్ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ + సెనెట్) ఆమోదించి అధ్యక్షుడు సంతకం చేయకపోతే ప్రభుత్వ ఖర్చులకు డబ్బు అందదు.ఈ పరిస్థితినే “షట్‌డౌన్” అంటారు.నిధుల కొరత వల్ల అత్యవసరం కాని ప్రభుత్వ కార్యకలాపాలు తాత్కాలికంగా మూతపడతాయి.
Also read: