రాష్ట్రవ్యాప్తంగా 84 శాతం మందికి సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.(Uttam kumar)
రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ:
“ఇంత గొప్ప కార్యక్రమం మరొకటి లేదు. గత పదేళ్లలో ఒకరికి కూడా రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం తర్వాత, మేం వచ్చాక 7.9 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం.”(Uttam kumar)
గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారిని ఉద్దేశించి:
“అప్పుడు అమ్ముకునే పరిస్థితి, ఇప్పుడు పేదలు కడుపునిండా తింటున్నారు” అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం,
రుణమాఫీ,
దొండపాడు-2 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా
10 వేల ఎకరాలకు నీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని మంత్రి తెలిపారు.
Also Read :

