Uttam Kumar Reddy: బనకచర్ల నిలుపుదల రాష్ట్ర ప్రభుత్వ విజయం

Uttam Kumar Reddy

 బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద విజయం అని నీటిపారుదలశాఖ మంత్రి (Uttam Kumar Reddy) ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి జరిగిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో (Uttam Kumar Reddy) మాట్లాడారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని, దాన్ని కేంద్రానికి స్పష్టంగా తెలియజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు.

తెలంగాణకు అన్యాయం జ‌రుగుతుంది

బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు నీటి హక్కుల విషయంలో అన్యాయం జరగనుంది. ముఖ్యంగా కృష్ణా నదిలోని వాటాలపై తెలంగాణకు అన్యాయం జరిగేలా పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి హెచ్చరించారు. ఈ విషయం మీద కేంద్ర జలశక్తి శాఖకు పలు వినతిపత్రాలు సమర్పించామని, కేంద్ర జలవనరుల సంఘాలకు పరిస్థితిని సమగ్రంగా వివరించామని తెలిపారు. ఈ అవగాహన కల్పించడంలో తెలంగాణ అధికారులు, నిపుణులు ఎంతో శ్రమించారని ఆయన కొనియాడారు.

పీ వాదనలలో బలం లేకపోవడం వల్ల తిరస్కారం

బనకచర్ల ప్రాజెక్టును నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిగులు జలాల పేరిట వాదనలు చేశారని, కానీ ఆ వాదనలలో సరైన ఆధారాలు, న్యాయబద్ధతలే లేకపోవడం వల్ల కేంద్రం వాటిని పట్టించుకోలేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వ కృషికి ప్రతిఫలంగా వచ్చిందని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ పోరాడుతుందని చెప్పారు.

ప్రభుత్వం సమైక్యంగా పనిచేస్తోంది

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు, సలహాదారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు, వేంపల్లి నరేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారు ఆదిత్యదాస్ నాథ్ తదితరులు హాజరయ్యారు.

ఈ అంశంపై ప్రభుత్వం అన్ని కోణాల్లో స్పందించడంతో తెలంగాణ ప్రజల నీటి హక్కులు పరిరక్షించబడినట్లు స్పష్టమవుతోంది.

Also read: