Vikek Venkataswamy : నాపై అక్కసుతోనే అడ్వర్టైజ్మెంట్స్​ బంద్

కాకాతోనే జైపూర్ పవర్ ప్లాంట్
వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలె
అన్ని సీట్లలో బీఆర్​ఎస్​ను ఓడించాలె
ప్రతిపక్షాలను కేసీఆర్​ అణచివేశారు
నాపై అక్కసుతోనే అడ్వర్టైజ్మెంట్స్​ బంద్
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(Vikek Venkataswamy )

బెల్లంపల్లి: రాష్ట్రంలో నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులస్తుల గౌరవాన్ని కాపాడుతామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి (Vikek Venkataswamy )అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కాకా కృషి ఫలితంగానే జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ రీఓపెనింగ్ కావడానికి కాకా ఎంతో కృషి చేశారన్నారు. రెండు పరిశ్రమల్లో సుమారు పదివేల మందికి ఉద్యోగాలు కల్పించారని ఆయన చెప్పారు. కాకా వెంకటస్వామిని పెద్దపల్లి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిపించి ఆదరించారని గుర్తు చేశారు. కాకా స్ఫూర్తితో ప్రజల సేవ కోసం ముందుకు వచ్చిన వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. గత పడేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులే బాగుపడ్డారని ఆరోపించారు. ప్రజా సమస్యలను వారు ఏనాడూ పట్టించుకోలేదని ఫైర్​ అయ్యారు. కేసీఆర్ ప్రతిపక్షాలపై కేసు అక్రమ కేసులు పెట్టి అణిచివేశారని మండిపడ్డారు. అహంకారి, నియంత అయిన కేసీఆర్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీని అన్ని సీట్లలో ఓడించాలని పిలుపునిచ్చారు. తనపై అక్కసుతో మీడియా సంస్థలకు అడ్వర్టైజ్మెంట్లో బంద్ చేయడమే కాకుండా పరిశ్రమలను మూసేయించారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడీ దాడులు చేయించాడని తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

వివేక్​.

 

Also read :

Uttar Pradesh : అర్చకులు కాదు పోలీసులు

K Kavitha : కవిత అరెస్టు అక్రమం కాదు