Virat: ఐసీసీ ర్యాంకింగ్స్ లో దిగజారిన కోహ్లీ

చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ(Virat), రోహిత్ తమ పేలవమైన ప్రదర్శనతో ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు. దీంతో ఇవాళ ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కిందకి దిగజారిపోయారు. కోహ్లీ(Virat) రెండు ఇన్నింగ్స్ లలో కేవలం 23 పరుగులే సాధించడంతో నేటి ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో తన స్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం 709 పాయింట్లతో 12 వ స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ లో కేవలం 11 పరుగులే చేయడంతో తాజా ర్యాంకింగ్స్ లో 716 పాయింట్లతో అతను 5వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయాడు. ఇక చెన్నై టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్ 751 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. ఇక చెన్నై టెస్టు సెంకడ్ ఇన్నింగ్స్ లో సెంచరీతో రాణించిన రిషబ్ పంత్ టాప్ 10 లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతను 731 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. ఇక ఇండో ఇన్నింగ్స్ లో సెంచరీతో రాణించిన శుభ్ మన్ గిల్ కూడా 5 స్థానాలను మెరుగుపరుచుకుని 701 పాయింట్లతో 14వ స్థానానికి చేరుకున్నాడు. ఇక సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో టెస్టులో భారత బ్యాటర్లు రాణిస్తే.. వారి ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం అతను 731 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. ఇక ఇండో ఇన్నింగ్స్ లో సెంచరీతో రాణించిన శుభ్ మన్ గిల్ కూడా 5 స్థానాలను మెరుగుపరుచుకుని 701 పాయింట్లతో 14వ స్థానానికి చేరుకున్నాడు. ఇక సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో టెస్టులో భారత బ్యాటర్లు రాణిస్తే.. వారి ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను 731 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. ఇక ఇండో ఇన్నింగ్స్ లో సెంచరీతో రాణించిన శుభ్ మన్ గిల్ కూడా 5 స్థానాలను మెరుగుపరుచుకుని 701 పాయింట్లతో 14వ స్థానానికి చేరుకున్నాడు. ఇక సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో టెస్టులో భారత బ్యాటర్లు రాణిస్తే.. వారి ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

ALSO READ :