VIRUSHKA:ఉజ్జయినిలో విరుష్క పూజలు

virat kohili and anushka sharma

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్​ విరాట్‌‌ కోహ్లీ, అనుష్క శర్మ (VIRUSKA)దంపతులు శనివారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌‌ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడో టెస్ట్‌‌ రెండున్నర రోజుల్లోనే ముగియడంతో కొంత మంది ప్లేయర్లు ఇండోర్‌‌లోనే ఉండిపోగా, కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ముంబైకి వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు వేదికైన అహ్మదాబాద్‌‌లో ఈ నెల 6న అతను టీమ్‌‌తో కలవనున్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ బెర్త్‌‌ నేపథ్యంలో.. సీనియర్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ షమీ నాలుగో టెస్ట్‌‌ ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఆడే అవకాశం ఉంది. వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లో భాగంగా సిరాజ్‌‌కు రెస్ట్‌‌ ఇవ్వొచ్చు.

Also Read: