Wayanad: నడుము లోతు నీరు.. 5 గంటల నరకం

Wayanad

వయనాడ్ : ప్రకృతి ప్రకోపానికి గురై ( Wayanad) వయనాడ్ జిల్లాలో ఎక్కడ చూసినా తమ వారి కోసం వెతుకులాటే కనిపిస్తోంది. కొండచరియలు విరిగిపడి దాదాపు 163 మందికిపైగా చనిపోయారు. ఆ శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. తమ వారి జాడను తెలుసుకోవడానికి బాధితుల బంధువులు ప్రయత్నిస్తున్నారు.

ముండక్కై నది వరదలు రావడంతో నడుము లోతు బురద నీటిలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. చుట్టు వరద నీరు, సగం మట్టి, రాళ్ల మధ్యలో అతను ఇరుక్కుపోయాడు.బురద నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అయిదు గంటలపాటు నరకం అనుభవించాడు. సహాయం కోసం అతను దిక్కులు చూస్తున్న వీడియో బయటకు రావడంతో ఎన్డీఆర్​ఎఫ్​ అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

Image

రెస్క్యూ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారు తమను రక్షించాలిన ఫోన్ల ద్వారా బంధువులను వేడుకుంటున్నారు. దీంతో ఫోన్​ లొకేషన్​ ఆధారంగా వారి జాడను తెలుసుకోవడాని ఆర్మీ     డాగ్​స్క్వాడ్​లను వాడుతున్నది. ఇప్పటివరకు 500 నుంచి 600 వరకు బాధితులను రక్షించినట్లు సైన్యం తెలిపింది. టీ, కాఫీ తోటల్లో పనిచేసే అస్సాం, బెంగాల్ నుంచి వచ్చిన 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు. మరో వైపు (Wayanad) వయనాడ్, పొరుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో కేంద్ర మంత్రి జార్జి కురియన్‌ పర్యటించి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను  పరామర్శించారు.

వారం ముందే హెచ్చరించాం (బాక్స్​)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: భారీ వర్షాలు పడి కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందేగానే హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. వయనాడ్​ప్రకృతి విపత్తుపై పార్లమెంట్​లో ఆయన మాట్లాడారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 150 మందికి పైగా మరణించారన్నారు. 200 మంది గాయపడ్డారని తెలిపారు. బాధితులకు అండగా నిలిచామన్నారు.గల్లంతైన 180 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి తొమ్మిది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపామని హోంమంత్రి పేర్కొన్నారు. “ప్రకృతి వైపరీత్యాలపై కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరించే నాలుగు దేశాలలో భారతదేశం ఒకటి” అన్నారాయన. ఈ ఘటనపై పీఎం మోదీ నిరంతరం పర్యవేక్షస్తున్నారన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయన్నారు.

Also read: