అమెరికా రాజధాని (Washington) వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ విమానం, మరో హెలికాప్టర్ ఢీకొని పొటోమాక్ నదిలో పాడిపోయాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులుఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. (Washington) వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది . గగనతలంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని, వీఐపీలు ఎవరూ లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదం అమెరికాలోని వైట్ హౌస్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో జరగడం గమనార్హం.
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ విమానం, మరో హెలికాప్టర్ ఢీకొని పొటోమాక్ నదిలో పాడిపోయాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులుఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది . గగనతలంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని, వీఐపీలు ఎవరూ లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదం అమెరికాలోని వైట్ హౌస్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో జరగడం గమనార్హం.
Also read:

