WaterTap: ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాప్ లపై దృష్టి పెట్టాలె

Water Tap

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. 2004 నుంచి ట్యాపింగ్ కు (WaterTap)  సంబంధించిన రికార్డులను బయటికి తీయాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లు కాకుండా వాటర్ ట్యాప్ (WaterTap) లపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ట్యాంకర్ల దందా నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం సమస్య పరిష్కరించకుంటే జలమండలి దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు. కరువు అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిందని, తెరవాల్సింది పార్టీ గేట్లు కాదని, ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేయాలని సూచించారు.

ఆరు శాతం వర్షపాతం నమోదైందని ఐఎండీ లెక్కలు చెబుతున్నాయని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువేనన్నారు. పంటలు పండితే రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తున్నదనే ఎండబెడుతున్నారని ఆరోపించారు. పదవులకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఓట్లు పడలేదని, అందుకే రేవంత్ బద్లా తీర్చుకుంటున్నారని ఆరోపించారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లెక్కితే సీఎం లంకె బిందెల కోసం వెతుకుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తనకు ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదని అన్నారు. హీరోయిన్లను బెదిరించానని అంటున్న మంత్రికి నెత్తి ఉందా..? అని ప్రశ్నించారు. తన క్యారెక్టర్ ను దెబ్బతీయాలని రేవంత్ చూస్తున్నారని ఆరోపించారు.