సంధ్య థియేటర్ (Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో పుష్ప ది రూల్ సినిమా హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 2.45 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సరిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. దాదాపు 20 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన పోలీసులు అల్లు అర్జున్ ను భారీ బందోబస్తు మధ్య ఇంటికి పంపించారు.
మళ్లీ విచారణకు పిలుస్తామని అప్పుడు తప్పకుండా హాజరు కావాలని సూచించినట్టు సమాచారం. ఠాణా నుంచి బయటికి వచ్చిన అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
పరదాలు వేసి..తీసేసి..
చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ లో విచారన జరుగుతున్న సమయంలో జూబ్లీ హిల్స్ లోని బన్నీ ఇంటికి పోలీసులు పరదాలు కట్టారు. విచారణ పూర్తవుతుందన్న సమాచారం రావడంతో వాటిని తొలగించారు. ఎందుకు వేశారు..? ఎందుకు తొలగించారన్నది అంతుచిక్కడం లేదు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో పుష్ప ది రూల్ సినిమా హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 2.45 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సరిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. దాదాపు 20 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన పోలీసులు అల్లు అర్జున్ ను భారీ బందోబస్తు మధ్య ఇంటికి పంపించారు.

Also read: