RajeevSagar: మేం కేసీఆర్ కోసం పనిచేస్తాం

RajeevSagar

మేం ఎప్పటికీ కేసీఆర్ కోసం పనిచేస్తామనే విషయం మరోసారి స్పష్టం  చేశారు తెలంగాణ జాగృతి నాయకుడు మేడే (RajeevSagar) రాజీవ్ సాగర్. హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన (RajeevSagar)ఆయన, కవిత తీసుకున్న కొన్ని రాజకీయ నిర్ణయాల వల్ల జాగృతి కోసం కష్టపడ్డ నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని వ్యాఖ్యానించారు.

రాజీవ్ సాగర్ మాట్లాడుతూ – “జాగృతి అనేది కేవలం ఒక సాంస్కృతిక వేదిక మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఒక భావజాల సంస్థ. అయితే ఈరోజు జాగృతి దారి తప్పినట్టుగా కనిపిస్తోంది. మేము కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ కోసం పనిచేశాం. ఇప్పుడు జాగృతి ఎవరి కోసం పనిచేస్తోంది?” అని ప్రశ్నించారు.

ఆయన మాటల్లో, కవితకు రెండు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు రావడం వెనుక జాగృతి కార్యకర్తల కృషి కూడా ఉందని చెప్పారు. కానీ, “ఆమె వెనుక ఉన్న వారికి నిజంగా సామాజిక న్యాయం జరిగిందా?” అని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి ఒక సామాజిక ఉద్యమంగా మొదలై, తరువాత బీఆర్ఎస్ పార్టీకోసం కృషి చేసింది. అయితే ఆ త్యాగాలు, కృషి చేసిన వారికి లభించిన గుర్తింపు ఏమిటి అని ప్రశ్నించడం గమనార్హం.

రాజీవ్ సాగర్ ప్రకారం, జాగృతి కార్యకర్తలు ఉద్యమం సమయంలో రాత్రింబవళ్లు కష్టపడి, గ్రామాలు చుట్టి, సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కానీ ఇప్పుడు ఆ కార్యకర్తలు రాజకీయంగా పక్కన పెట్టబడ్డారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

“ఇన్ని ఏండ్లు మేము మీ కోసం పనిచేశాం. కానీ ఈరోజు మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కోసం, తెలంగాణ కోసం పనిచేయడం తాము గౌరవంగా భావిస్తున్నప్పటికీ, రాజకీయ అవకాశాల విషయంలో జాగృతి వెనుకబడ్డ నాయకులను గౌరవించాల్సిన అవసరం ఉందని రాజీవ్ సాగర్ స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కవితపై పరోక్ష విమర్శలు చేసిన రాజీవ్ సాగర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలకు సంకేతమా? లేక కేవలం వ్యక్తిగత ఆవేదనా? అన్నది పరిశీలించాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పారు – “మేము ఎప్పటికీ కేసీఆర్ కోసం పనిచేస్తాం. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం” అని.

Also read: