కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న కరెంట్‌ని ఊడగొట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి (KTR)కేటీఆర్మండిపడ్డారు. కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈఆర్సీ చైర్మన్ రంగారావుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి 18,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైంది. ఇంత భారీగా ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడం దారుణం. ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు ఒకటే రేటు, గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ ద్వారా మోపాలని కుట్ర చేస్తుంది’ అని ఫైర్అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న కరెంట్‌ని ఊడగొట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి (KTR)కేటీఆర్మండిపడ్డారు. కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈఆర్సీ చైర్మన్ రంగారావుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి 18,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైంది.
ఇంత భారీగా ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడం దారుణం. ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు ఒకటే రేటు, గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ ద్వారా మోపాలని కుట్ర చేస్తుంది’ అని ఫైర్అయ్యారు.
Also read:

