ఛత్తీస్‌గఢ్: తనని ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడనే కోపంతో ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బానుపురికి చెందిన దమ్రుధర్ బాఘేల్ (25) అనే వ్యక్తి ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో బాఘేల్.. ప్రియురాలిని దూరం పెట్టాడు. మరో యువతితో అతనికి పెళ్లి ఖాయమైంది. ఈ విషయం తెలియడంతో మాజీ ప్రియురాలు కోపంతో ప్రియున్ని చంపాలని నిశ్చయించుకుంది. పెళ్లి జరిగే సమయంలో అబ్బాయిలా వేషం వేసుకుని యాసిడ్ సీసాతో మండపానికి వచ్చింది. ఆ సీసాను అతనిపై విసరడంతో వధూవరులకు గాయాలయ్యాయి. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలోనే కరెంట్ పోవటంతో నిందితురాలు అక్కడి నుంచి పరారైంది. మండపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు మారువేషంలో వచ్చింది అమ్మాయిగా గుర్తించారు. దాడి చేసిన మహిళ వరుడి మాజీ ప్రియురాలిగా నిర్ధారించారు. ఆమెను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు.
ALSO READ:

