‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం **‘కింగ్డమ్’**పై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది(Nagavamsi). ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. విజయ్ లుక్, టీజర్ గ్లింప్స్‌తో పాటు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఆమె తమిళ, కన్నడ భాషల్లో నటించి గుర్తింపు పొందిన తర్వాత తెలుగులో అడుగుపెడుతున్నారు. అనిరుధ్ మ్యూజిక్, గౌతమ్ తిన్ననూరి విజన్, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మిళితమై సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అంచనా వేయడం ఫ్యాన్స్‌కు కష్టంగా మారింది.(Nagavamsi)
అయితే, ఇటీవల సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ పోస్టులపై నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ ఫేమ్ నాగవంశీ స్పందించారు.
తన ట్వీట్ ద్వారా,

“ఏం పోస్ట్ చేసినా ‘కింగ్డమ్’ మీద తీపి శాపాలు, తిట్లు వస్తూనే ఉంటాయని నాక్కూడా తెలుసు. కానీ నన్ను నమ్మండి. మా టీమ్ 24 గంటలూ పనిచేస్తోంది. నేను మీకు హామీ ఇస్తున్నా – ఈ సినిమా అందించే అనుభూతి, ఉత్సాహం మీరు ఊహించలేరు. మూవీ చూసాక చెప్తున్నా… రాసిపెట్టుకోండి, విన్నర్ కింగ్డమే!”
అంటూ అభిమానులకు ధైర్యం చెప్పారు.
ఇకపోతే, ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్మెంట్ పై క్లారిటీ రాలేదు. అయితే నాగవంశీ మాటల ప్రకారం చూస్తే, త్వరలోనే మేకర్స్ వాటిని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో పాటు, సోషల్ మీడియాలో కొంతమంది వాడిన అసభ్యకర పదజాలం, నెగటివ్ ట్రెండ్స్‌పై నిర్మాత ఈ విధంగా స్పందించడం, సినిమాపై ఎంతగా నమ్మకముంటేనే అన్నది స్పష్టంగా అర్థమవుతోంది.
మొత్తంగా చూస్తే, ‘కింగ్డమ్’ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లో మరో మైలురాయిగా నిలవబోతోందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలో రానున్న విడుదల తేదీ, టీజర్, పాటలతో ఈ సినిమా ఇంకెంత హైప్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

