Yami Gautam: యామీకి కొడుకు పుట్టిండు

నువ్విలా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నటి యామీ గౌతమ్ (Yami Gautam). ఆ తర్వాత పలు బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా మారిపోయింది. తన భర్త ఆదిత్యనాథ్ తో కలిసి సోషల్ మీడియా వేదికగా ఓ వార్తను షేర్ చేసింది (Yami Gautam)యామీ. తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపింది. ఆ బాబుకు ‘వేదవిద్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘మరొక అందమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. మా కుమారుడి గొప్ప భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నాం. అతడు ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం. మా కుటుంబానికి అలాగే దేశానికి గర్వకారణమయ్యేలా ఎదగాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నెటిజెన్లు అభినందనలు చెబుతున్నారు. యామీ-ఆదిత్యధర్‌లు 2021లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

Also read: