YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్‌కు తాత్కాలిక ఊరట!

YS Jagan

మాజీ ముఖ్యమంత్రి (YS Jagan) వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జరిగిన సంఘటనకు సంబంధించి (YS Jagan) పై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.

విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటి వరకు జగన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు స్పష్టం చేసింది.

సంఘటన నేపథ్యం: జూన్ 18న జగన్ పర్యటన సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మరణం చెందాడు. జగన్ కాన్వాయ్ వల్లే ప్రమాదం జరిగిందని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చారు.

 అయితే, జగన్ వాదన ప్రకారం – “ఇది రాజకీయ ప్రతీకార చర్య. ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నారు.”

హైకోర్టు వ్యాఖ్య: “కారు ప్రమాదం జరిగితే, కారులో ఉన్న ప్రయాణికులపై కేసు ఎలా పెడతారు? ప్రమాదానికి వాళ్లు ఎలా బాధ్యులు అవుతారు?” అని కోర్టు ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను జులై1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిసింది. ఈ నెల 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త మరణించాడు. జగన్‌ కాన్వాయ్‌ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు..

Imageనిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని, ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ కేసులో ధర్మాసనంన ఇవాల విచారణ జరిపింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు? ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు? ’’ అని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు వినిపించేందుకు సమయం కావాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను జులై1కి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితులపై ఎలాంటిచర్యలూ తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు సూచించింది.

Also read: