Bihar: బీహార్ లో 65% రిజర్వేషన్లు రద్దు

Bihar

హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిహార్(Bihar) లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో 65 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయాన్ని కొట్టివేసింది. ఈ మేరకు పెరిగిన రిజర్వేషన్లకు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది. (Bihar)  రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరద్దుమని స్పష్టం చేసింది. కాగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం.. గతేడాది నవంబర్ 21న బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పెంపుతో ఎస్సీలకు 16 నుంచి 20 శాతం, ఎస్టీలకు ఒక శాతం నుంచి రెండు శాతం, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30శాతం ఉన్న రిజర్వేషన్‌ శాతం 43కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఈడబ్ల్యూ ఎస్ 10శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ ఈ రిజర్వేషన్లను కొట్టి పారేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిహార్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో 65 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయాన్ని కొట్టివేసింది. ఈ మేరకు పెరిగిన రిజర్వేషన్లకు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరద్దుమని స్పష్టం చేసింది. కాగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం.. గతేడాది నవంబర్ 21న బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పెంపుతో ఎస్సీలకు 16 నుంచి 20 శాతం, ఎస్టీలకు ఒక శాతం నుంచి రెండు శాతం, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30శాతం ఉన్న రిజర్వేషన్‌ శాతం 43కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఈడబ్ల్యూ ఎస్ 10శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ ఈ రిజర్వేషన్లను కొట్టి పారేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Also read: