Maharashtra: మహారాష్ట్రను వణికిస్తున్న కొత్త వ్యాధి

Maharashtra

మహారాష్ట్ర (Maharashtra) ను గులియన్ బారే సిండ్రోమ్ అనే బ్యాక్టీరియా వణికిస్తోంది. అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ ఈ జీబీఎస్. ఇప్పటికే 101 మందికి ఈ బ్యాక్టీరియా సోకింది. ఇందులో 16 మంది వెంటిలేటర్లపై ఉండి చికిత్స పొందుతున్నారు. షోలాపూర్ కు చెందిన ఓ వ్యక్తి పుణె ఆస్పత్రిలో ఈ బ్యాక్టీరియా బారిన పడి మృతి చెందాడు. శనివారం రోజు వరకు 73 మందికి ఈ వ్యాధి రాగా ఆదివారం ఒక్కరోజే 28 కేసులు నమోదయ్యాయి. అప్పటి వరకు కేవలం 14 మందివెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య కూడా 16కు చేరుకుంది. బాధితుల నుంచి నమూనాలను సేకరించి పరిశీలించగా.. వారిలో క్యాంపిలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. (Maharashtra) పుణేలోని ప్రధాన నీటి నిల్వ ప్రాంతమైన ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని ఓ బావిలో ఈ కోలి అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా నరాలపై దాడి చేస్తుంది. బలహీన పడి, పక్షవాతం వచ్చిన రోగిలా మారుతారు. బాధిత రోగుల్లో 80% డిశ్చార్జి అయిన నెల రోజుల్లోపు తిరిగి స్వతంత్రంగా నడుస్తారు. అయినప్పటికీ, కొంతమంది రోగులు పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.ఈ వ్యాధి చికిత్స చాలా ఖర్చుతో కూడుకొంది. రోగులకు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఒక్కోదానికి సుమారు రూ. 20,000 వరకు ఉంటుంది.


లక్షణాలు ఇవి
ఈ వ్యాధి సోకిన వారికి ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. లేచి నిలబడలేని స్థితికి చేరుతారు. దీనికి తోడు వాంతులు, విరేచనాలు కూడా వస్తాయి. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.

మహారాష్ట్రను గులియన్ బారే సిండ్రోమ్ అనే బ్యాక్టీరియా వణికిస్తోంది. అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ ఈ జీబీఎస్. ఇప్పటికే 101 మందికి ఈ బ్యాక్టీరియా సోకింది. ఇందులో 16 మంది వెంటిలేటర్లపై ఉండి చికిత్స పొందుతున్నారు. షోలాపూర్ కు చెందిన ఓ వ్యక్తి పుణె ఆస్పత్రిలో ఈ బ్యాక్టీరియా బారిన పడి మృతి చెందాడు. శనివారం రోజు వరకు 73 మందికి ఈ వ్యాధి రాగా ఆదివారం ఒక్కరోజే 28 కేసులు నమోదయ్యాయి. అప్పటి వరకు కేవలం 14 మందివెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య కూడా 16కు చేరుకుంది. బాధితుల నుంచి నమూనాలను సేకరించి పరిశీలించగా.. వారిలో క్యాంపిలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు.పుణేలోని ప్రధాన నీటి నిల్వ ప్రాంతమైన ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని ఓ బావిలో ఈ కోలి అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా నరాలపై దాడి చేస్తుంది. బలహీన పడి, పక్షవాతం వచ్చిన రోగిలా మారుతారు. బాధిత రోగుల్లో 80% డిశ్చార్జి అయిన నెల రోజుల్లోపు తిరిగి స్వతంత్రంగా నడుస్తారు. అయినప్పటికీ, కొంతమంది రోగులు పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.ఈ వ్యాధి చికిత్స చాలా ఖర్చుతో కూడుకొంది. రోగులకు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఒక్కోదానికి సుమారు రూ. 20,000 వరకు ఉంటుంది.

Image
లక్షణాలు ఇవి
ఈ వ్యాధి సోకిన వారికి ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. లేచి నిలబడలేని స్థితికి చేరుతారు. దీనికి తోడు వాంతులు, విరేచనాలు కూడా వస్తాయి. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.

Also read: