యూపీలో ఇవాళ తెల్లవారుజామున ఎన్ హెచ్ 74 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిజ్నోర్ (Bijnor) లో వివాహం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా వధూవరులు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. కాగా పక్కనే వెళ్తున్న వాహనాన్ని ఆటో ఓవర్ టేక్ చేస్తుండగా పొగమంచు వల్ల రోడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో వధూవరులతో పాటు మరో ఐదుగురు మరణించారు. కాగా నిన్న సాయంత్రం జార్ఖండ్ లో వివాహం జరిగింది. అనంతరం (Bijnor) బిజ్నోర్‌లోని స్వగ్రామం ధాంపూర్ కి వధూవరులు వస్తున్నారు. మొరాదాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన ఆటోకు దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తెలిపారు. మృతుల్లో వధువు, వరుడు, వరుడి కుటుంబ సభ్యులు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉన్నతాధికారి తెలిపారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
యూపీలో ఇవాళ తెల్లవారుజామున ఎన్ హెచ్ 74 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిజ్నోర్ లో వివాహం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా వధూవరులు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. కాగా పక్కనే వెళ్తున్న వాహనాన్ని ఆటో ఓవర్ టేక్ చేస్తుండగా పొగమంచు వల్ల రోడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో వధూవరులతో పాటు మరో ఐదుగురు మరణించారు. కాగా నిన్న సాయంత్రం జార్ఖండ్ లో వివాహం జరిగింది. అనంతరం బిజ్నోర్‌లోని స్వగ్రామం ధాంపూర్ కి వధూవరులు వస్తున్నారు. మొరాదాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన ఆటోకు దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తెలిపారు. మృతుల్లో వధువు, వరుడు, వరుడి కుటుంబ సభ్యులు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉన్నతాధికారి తెలిపారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Also read: