లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(BJP), కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టుగా ఆధిక్యతలు చాటుతున్నాయి. బీజేపీ(BJP) 8 స్థానాల్లో ఆధిక్యతను చాటుతుండగా కాంగ్రెస్ ఏడు చోట్ల ముందంజలో ఉంది. హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో కొనసాగుతోంది. కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, మెదక్, నిజామాబాద్ తో పాటు మరో రెండు స్థానాల్లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరితో పాటు మరో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యతను చాటుతోంది.
కౌంటింగ్ సెంటర్ నుంచి వెనుదిరిగిన నామా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీలు నమోదవుతుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.
Also read:

