NEET2024: నీట్ పై సీబీఐ విచారణ చేయించాలి

NEET2024

నీట్ (NEET2024)  పరీక్షలో అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐ  విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా నీట్ (NEET2024) పరీక్ష వ్యవహారంలో ఎన్టీఏ కూడా సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఇక ఈ పిటిషన్ పై విచారణను జులై8కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

Also read: