మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న చలపతి (Chattisgarh) చత్తీస్ గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు. (Chattisgarh) చలపతి చనిపోవడం భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయమే. చలపతిపై రూ. 1 కోటి రివార్డు ఉంది. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన చలపతి అసలు పేరు జయరాం రెడ్డి. కీలక యాక్షన్స్ లో చలపలి పాల్గొన్నాడు. చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే అతడి ప్రాణాలను తీసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ ‘డిప్యూటీ కమాండర్’ అయిన అతని భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ భద్రతా దళాలకు అతన్ని గుర్తించడంలో సహాయపడింది. మే 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న ఒక స్మార్ట్‌ఫోన్ లో ఈ ఫొటో చిక్కింది. ఈ ఫొటో ఆధారంగా ట్రేస్ చేసిన భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టి దాడి చేయడంతోనే చలపతి సహా 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం.
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న చలపతి చత్తీస్ గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు. చలపతి చనిపోవడం భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయమే. చలపతిపై రూ. 1 కోటి రివార్డు ఉంది. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన చలపతి అసలు పేరు జయరాం రెడ్డి. కీలక యాక్షన్స్ లో చలపలి పాల్గొన్నాడు. చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే అతడి ప్రాణాలను తీసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ ‘డిప్యూటీ కమాండర్’ అయిన అతని భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ భద్రతా దళాలకు అతన్ని గుర్తించడంలో సహాయపడింది. మే 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న ఒక స్మార్ట్‌ఫోన్ లో ఈ ఫొటో చిక్కింది. ఈ ఫొటో ఆధారంగా ట్రేస్ చేసిన భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టి దాడి చేయడంతోనే చలపతి సహా 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం.
Also read:

