CM Revanth: వరద నష్టంపై కేంద్రంతో చర్చలు

CM Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీలో బిజీ షెడ్యూల్‌తో కొనసాగుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, ఇటీవల భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. (CM Revanth) రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోనే ఉండి సమస్యలను కేంద్రానికి తెలియజేస్తున్నారు.

Image

మంగళవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. ఈ సందర్భంగా భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణకు కలిగిన నష్టం వివరాలను అందజేశారు. కేంద్రం నుంచి అత్యవసర సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.

Image

ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఆయన కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్–అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్, అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇటీవల వర్షాల కారణంగా దెబ్బతిన్న జాతీయ రహదారులను త్వరగా మరమ్మతు చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేయనున్నారు.

Image

రేపు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లను కలవనున్నారు. అమిత్ షాతో భేటీలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు సహాయం అందించాలని కోరనున్నారు. మరోవైపు, రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణలో ఉన్న రక్షణ శాఖ భూముల సమస్యపై చర్చించనున్నారు. ఈ భూములను రాష్ట్ర ప్రజల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం.

Image

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు, రహదారులు, ఇళ్లు తీవ్ర నష్టానికి గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం, వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అత్యవసర సాయం అందాలని సీఎం రేవంత్ కోరుతున్నారు.

Image

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో సీఎం చేస్తున్న ఈ వరుస భేటీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్రంతో మంచి అనుసంధానం ఏర్పరిస్తే తెలంగాణకు భారీ నిధులు రాబట్టవచ్చనే ఆశ రాష్ట్ర ప్రజల్లో ఉంది.

Also read: