Congress: 5 గ్యారంటీలు

ఢిల్లీ : లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహిళలపై కాంగ్రెస్ (Congress) పార్టీ హామీల వర్షం కురిపించింది. ‘నారీ న్యాయ్’ పేరుతో మహిళలకు ఐదు గ్యారంటీలను ప్రకటించింది. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ 1లక్ష నగదు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది ‘శక్తి కా సమ్మాన్’ కింద ఆశ కార్యక ర్తల కు నిధులు రెట్టింపు చేయనున్నట్లు పేర్కొంది. ‘అధికార మైత్రి’ కింద న్యాయ హక్కులపై అవగాహన కల్పించనునట్లు తెలిపింది. రెండు రోజుల్లో లోక్ సభ ఎన్ని కల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress) ఈకీలక నిర్ణయాలు తీసుకుంది.

Also read: