Israel : ఇజ్రాయెల్ లో కార్చిచ్చు

Israel

ఇజ్రాయెల్(Israel) లో కార్చిచ్చు చెలరేగింది. మూడు వేల ఎకరాల అడవి తగలబడి పోయింది. జెరూసలెం శివారులోని అడవుల్లో ఈ ప్రమాదం సంభవించింది. పొడి వాతావరణం, గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వాప్తి చెందుతున్నాయి. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. 24 గంటల్లో వేలాది మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.

fires in Israel | The Times of Israel

దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా భావిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడ్డారు. అయితే ప్రాణనష్టం ఇంకా తెలియరాలేదు. జెరూసలెం నుంచి తెల్ అవీవ్ ప్రధాన రహదారి వరకు మంటలు వ్యాపించటంతో ఆ దారులన్నీ అధికారులు మూసేశారు. అలాగే, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ మంటలను ఆర్పేందుకు 160కి పైగా అగ్నిమాపక బృందాలు, డజన్ల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లు, సైన్యం కూడా రంగంలోకి దిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదం కారణంగా మే 14న జెరూసలెంలో జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్స వేడుకలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది.

 

Also read :

Gold : గోల్డ్ రేట్ డౌన్

phalgum: పత్తాలేని పాక్​ ఆర్మీ చీఫ్​