Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ కన్నుమూత

Manmohan Singh

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. వృద్దాప్య సంబంధిత కారణాలతో ఆయన్ని కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మన్మోహన్ పదేండ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవలందించారు. ఆర్థిక సంస్కరణల సూత్రధారి (Manmohan Singh) మన్మోహన్ కు పేరుంది.

యూపీఏ కూటమికి ప్రధానిగా 2004-14 మధ్య పని చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26వ తేదీ 2024 రోజున రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. 1991లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు క్యాబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా చేరిన మన్మోహన్ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

Image

పంజాబ్ (పాకిస్తాన్)లోని గాహ్ గ్రామంలో 1932, సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్ చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇందిరా గాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా సేవలందించారు. ఐఎంఎఫ్​ సహా అంతర్జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం పనిచేసిన మూడో ప్రధానిగా రికార్డును సొంతం చేసుకున్న మన్మోహన్ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. వృద్దాప్య సంబంధిత కారణాలతో ఆయన్ని కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మన్మోహన్ పదేండ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవలందించారు. ఆర్థిక సంస్కరణల సూత్రధారి మన్మోహన్ కు పేరుంది. యూపీఏ కూటమికి ప్రధానిగా 2004-14 మధ్య పని చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26వ తేదీ 2024 రోజున రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. 1991లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు క్యాబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా చేరిన మన్మోహన్ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పంజాబ్ (పాకిస్తాన్)లోని గాహ్ గ్రామంలో 1932, సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్ చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇందిరా గాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా సేవలందించారు. ఐఎంఎఫ్​ సహా అంతర్జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం పనిచేసిన మూడో ప్రధానిగా రికార్డును సొంతం చేసుకున్న మన్మోహన్ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also read: