GST: జీఎస్టీ 2 శ్లాబులు

GST

నాలుగు నుంచి రెండు శ్లాబులు

ఇప్పటి వరకు నాలుగు శ్లాబులుగా ఉన్న (GST) జీఎస్టీని రెండు శ్లాబులకే పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు మంత్రుల బృందం (GST) ఆమోదం తెలిపింది.

తొలగించనున్న శ్లాబులు

ప్రస్తుతం 5%, 12%, 18%, 28% శ్లాబులు అమల్లో ఉన్నాయి. వీటిలో 12% మరియు 18% శ్లాబులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై 5% మరియు 18% శ్లాబులు మాత్రమే ఉండేలా చూడనున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్‌ చౌదరి వెల్లడించారు.

లగ్జరీ, సిన్ గూడ్స్‌పై పన్ను

కేంద్ర ప్రతిపాదనలో ఆల్ట్రా లగ్జరీ వస్తువులు, సిన్ గూడ్స్ (సిగరెట్లు వంటివి)పై 40% పన్ను విధించడం కూడా ఉందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. ప్రస్తుతం ఉన్న పన్ను రేటు కొనసాగుతుందని, కానీ లగ్జరీ వస్తువులపై అదనపు లెవీ ప్రతిపాదించారని వివరించారు.

మంత్రుల బృందం సమావేశం

జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై చర్చించేందుకు సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం గురువారం సమావేశమైంది.

FurtherMore: