HeavyRains: దేశవ్యాప్తంగా భారీ వర్షాల అలర్ట్

HeavyRains

దేశవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. (HeavyRains) ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. (HeavyRains)

ఉత్తర భారతంలో వానలు

Image

ఉత్తరాఖండ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. చమోలీ, భాగేశ్వర్, పథోరాగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఉత్తర కాశీ, తెహ్రీ గర్వాల్, రుద్రప్రయాగ్, హరిద్వార్, అల్మోరా, నైనీతాల్, ఉదంసింగ్ నగర్ జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు.

హిమాచల్‌లో వర్షాలు

Image

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. సోలన్, సిర్మౌర్ ప్రాంతాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు.

పంజాబ్ పరిస్థితి

Image

పంజాబ్‌లోని గురుదాస్‌పుర్, పఠాన్‌కోట్ జిల్లాల్లో వరద ముంపు ప్రమాదం ఉంది. దీంతో ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ సహా అన్ని విభాగాల సిబ్బందిని మోహరించారు.

Image
గత రెండు రోజుల్లో 2 వేలకుపైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు.

హర్యానా వాతావరణం

Image

హర్యానాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. యమునానగర్, అంబాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.

ఢిల్లీ స్థితి

Image

దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది 204.5 మీటర్ల మార్క్ దాటింది. ఇవాళ కూడా ప్రమాద స్థాయిలోనే ప్రవహిస్తుందని అధికారులు చెప్పారు.

Image

దక్షిణ భారతం

కోస్తా కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. సెంట్రల్ మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.

Also read: