AmitShah: హిందీయే ఫ్రెండ్లీ ల్యాంగ్వేజీ

AmitShah

భారతీయ భాషలన్నింటికీ హిందీ శత్రువు కాదు – దోస్త్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (AmitShah) స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన అధికార భాషా విభాగం స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు మాట్లాడే భాషలో పాలన సాగాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని (AmitShah) పేర్కొన్నారు.

హిందీని భయపడాల్సిన అవసరం లేదు:
‘‘హిందీని ఇతర భారతీయ భాషలకు ప్రత్యర్థిగా చూడటం తప్పు. ప్రతి భాషకు తగిన గౌరవం ఉండాలి. హిందీ దేశ భాషలందరికీ మిత్రమే, శత్రువు కాదు’’ అని అమిత్ షా అన్నారు. మన దేశ భాషలు పరస్పర సంబంధంతో అభివృద్ధి చెందతాయనీ, వాటిని ఎదురుదాడిగా చూడకూడదని ఆయన సూచించారు.

ప్రజల భాషలోనే పాలన అవసరం:
‘‘ప్రజల భాషలో పాలన జరిగితేనే ప్రభుత్వ విధానాలు, పథకాలు ప్రజలకు చేరువవుతాయి’’ అని తెలిపారు. ప్రజల మనసుకు హత్తుకునే భాషల్లోనే పాలన సాగించాల్సిన అవసరం ఉన్నదని, అదే ప్రజాస్వామ్యానికి బలమని పేర్కొన్నారు.

విదేశీ భాషల కంటే భారతీయ భాషల ప్రాధాన్యత:
‘‘ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ లాంటి భాషలను అభినందించే ప్రజలు, తమ సొంత మాతృభాషలను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. మన భావాలను మన భాషలో వ్యక్తం చేయలేకపోతే అది బానిసత్వానికి సంకేతం. ఆ మనస్థత్వం నుంచి బయట పడాలి’’ అని ఉద్గారపడ్డారు.

పరీక్షలు 13 భాషల్లో – అభ్యర్థుల నమ్మకం ప్రాంతీయ భాషలపై:
JEE, NEET, CUET లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ప్రస్తుతం 13 భాషల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 95 శాతం మంది అభ్యర్థులు తమ ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. ఇది స్థానిక భాషలపై విశ్వాసాన్ని చాటుతోంది.

రాష్ట్రాల సహకారంతో భారతీయ భాషల విస్తరణ:
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో భారతీయ భాషల వినియోగం పెంచేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో స్థానిక భాషలు కీలకపాత్ర పోషించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

2047 నాటికి అభివృద్ధి దేశంగా భారత్ లక్ష్యం:
భారత స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని తెలిపారు. అందుకు భాష కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.

Also Read :