పుణె: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్(Pratibha patil) అనారోగ్యంతో దవాఖానలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న పాటిల్ మహారాష్ట్రలోని పుణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 89 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్(Pratibha patil) నిన్న భారతి ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులొకరు మీడియాతో మాట్లాడుతూ ‘ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి. ఆమె 2007 నుంచి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొనసాగారు.
Also read:

