2047 లోగా ఇండియా అభివృద్ధి చెందుతది :  మోడీ

2047 కల్లా ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో టెక్నాలజీ సాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ ప్రజలందరికీ డిజిటల్ విప్లవ ప్రయోజనాలు చేరువకావాలనే ఉద్దేశంతో ఆధునిక డిజిటల్ సౌలతులను సృష్టిస్తున్నామని వివరించారు. ‘అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీషింగ్ ది పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’ అనే అంశంపై నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ వెబినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మాట్లాడారు. చిన్న వ్యాపారాలకున్న నిబంధనలను తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటోందని, అనవసరమైన నిబంధనల జాబితాను రూపొందించాలని కోరారు.

తాము ఇప్పటికే 40 వేల నిబంధనలను తొలగించామని తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించడానికి, ‘ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను రూపొందించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నామని చెప్పారు. ‘‘5జీ, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి సాంకేతికతలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, అనేక ఇతర రంగాలను సమూలంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. వన్ నేషన్ వన్ రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాంకేతికతే పునాదిగా మారింది. పేదలకు ప్రయోజనాలను అందించడంలో జామ్ (జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ నంబర్) ఎంతో ఉపయోగపడింది” అని వివరించారు.

టెక్నాలజీ సాయంతో ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని కొన్నేళ్లుగా ప్రతి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నొక్కిచెబుతున్నామని, ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని చెప్పారు. సమస్యల పరిష్కారానికి, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు వివిధ శాఖలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. మిషన్ కర్మయోగి కింద.. ట్రైనింగ్ ప్రక్రియను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేస్తుండాలని సూచించారు.